పద్మనగర్ సంతోషిమాత ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు
11-09-2026 | 05:04pm
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): శ్రావణ శుక్రవారం చివరి రోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లోని శ్రీ సంతోషిమాత దేవాలయం(Padmanagar Santoshi Mata Temple)లో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు.