కూలీల ప్రాణాలకు బాధ్యులు ఎవరు

02-11-2026 | 06:17pm
  1. కెపాసిటీ మించి ఆటోలో, ట్రాలీ ఆటోలో ట్రాక్టర్లలో  కూలీల తరలింపు 
  2. బోయినపల్లి మండలానికి జగిత్యాల కరీంనగర్ జిల్లాల నుంచి కూలీల తరలింపు
  3. వాహనాలు తనిఖీ చేయాల్సిన అధికారులు నెల్లూరు లక్ష్యం 
  4. జరగరాని ప్రమాదం జరిగితే బాధలు ఎవరు 

బోయినపల్లి : నవంబర్ 2 ( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) బోయినపల్లి మండలంలోని 23 గ్రామాలకు జగిత్యాల కరీంనగర్ జిల్లాల నుంచి ఆటోలు ట్రాక్టర్లు లలో నిత్యం కూలీలను కెపాసిటీ మించి తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం(Government regulation) టాక్సీ ఆటోలు, ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్లు ( వ్యవసాయేతర పనులకు వాడే ) ట్రాక్టర్లు మాత్రమే కూలీలను తరలించాలి. కానీ ఇక్కడ నిబంధన మాత్రం ఏమి పని చేయడం లేదు.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల, మల్యాల పెగడపల్లి, గంగాధర, మానకొండూరు తదితర బోయినపల్లి మండలానికి పత్తి తీయడానికి ఇతర వ్యవసాయ పనులకు వాహనాల్లో కూలీలను తీసుకొస్తున్నారు. నిబంధన ప్రకారం ట్రాలీ ఇతర వాహనాల్లో సీట్లలో కూర్చుని వారిని మాత్రమే తీసుకురావాలి. కానీ ఒక్కొక్క వాహనంలో 30 నుంచి 40 మందిని ఒక్కొక్కరిపై కూర్చుండబెట్టి తీసుకొస్తున్నారు. ఎదురుగా వాహనం వస్తే లేదా ఇంకా ఇతర ఏమైనా ప్రమాదం జరిగితే వాహనం బోల్తాపడడానికి ఆస్కారం ఉంటుంది.

అంతేకాకుండా రైతులకు కూడా అదన భారం పడుతుంది. ఒక్కొక్క కూలికి రోజుకు 300 కూలి ఇవ్వడంతో పాటు, వారికి నీళ్లు ఇతర సౌకర్యాలు  రైతులే కనిపిస్తున్నారు. రైతులు పంట సాగు చేసినప్పటి నుంచి దిగుబడి వచ్చేవరకు ఈ అదనపు ఖర్చులతో నాన ఇబ్బందులు పడుతున్నారు. గిట్టు బాటు ధర దేవుడు ఎరుగు కానీ కూలీలు వాహన ఖర్చు రైతులకు తడిసి మోపిన అవుతుంది.

ఇది ఇలా ఉండగా మోతాదుకు మించి, అతివేగంతో కూలీలను తీసుకొస్తున్న వాహనాల యజమానులు ఏమైనా ప్రమాదం జరిగితేప్రమాద కూలీల ప్రాణులకు ఎవరు బాధ్యులు. పోలీసులు రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేసి సామర్థ్యానికి మించి ఉండకుండా కూలీలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా అధికారులు ఉదయం సాయంత్రం వాహనాలను తనిఖీ  చేసి కూలీల ప్రాణాలకు రక్షణ కల్పించాలి.

మరిన్ని వార్తలు