డ్రైనేజీ పైప్‌లైన్ పనులపై అభ్యంతరం
ప్రజావాణిలో ది సిటీజన్స్ కౌన్సిల్ ఫిర్యాదు
మణికొండ, నవంబర్ 2 (విజయక్రాంతి): ఓయూ కాలనీ నాగమ్మ దేవాలయం(Nagamma Temple, OU Colony) నుంచి అంబియన్స్ కోర్టు వరకు వర్షపు నీటి పైప్‌లైన్ పేరుతో చేపడుతున్న పనులు భూగర్భ డ్రైనేజీని తలపిస్తున్నాయని ది సిటీజన్స్ కౌన్సిల్ ఆరోపించింది. పందెం వాగులో కలిపితే హ్యూడా కాలనీ, మణికొండ క్వార్టర్స్, ఎంప్లాయీస్ కాలనీతో పాటు పరిసర కాలనీలకు దుర్వాసన, ముంపు ప్రమాదం ఏర్పడుతుందని ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో చీఫ్ ఇంజనీర్‌కు వివరణ ఇస్తామని అధికారులు తెలిపినట్లు కౌన్సిల్ పేర్కొంది. ప్రజలకు ముప్పు కలిగించే పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.