నేడు మానకొండూర్ ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
మానకొండూరు, అక్టోబర్ 24 (విజయక్రాంతి): మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Manakondur Agricultural Market Committee)(ఏఎంసీ) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఉదయం 9.30 గంటలకు మార్కెట్ యార్డ్(Market Yard) లో జరుగుతుందని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఏఎంసీ చైర్ పర్సన్ గా రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ గా రేమిడి శ్రీనివాస్ రెడ్డితోపాటు పాలకవర్గ సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేస్తారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(Dr. Kavvampalli Satyanarayana) ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని ప్యాక్స్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు,ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, ముఖ్యంగా రైతులు,మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.