గ్రామ సేవకులకు బతుకమ్మ కానుకలు

12-10-2026 | 11:46pm

నూకలమర్రిలో చీరలు, దుస్తుల పంపిణీ

వేములవాడ,(విజయక్రాంతి): బతుకమ్మ పండుగ(Bathukamma Festival)ను పురస్కరించుకుని నూకాలమర్రి గ్రామంలో రోమాల ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు(Anganwadi teachers), హెల్పర్లకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి సింగిల్ విండో చైర్మన్ వకుళాభరణం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రోమాల ప్రవీణ్ మాట్లాడుతూ... గ్రామ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. వారి సేవలకు గుర్తింపుగా పండుగ కానుకలు అందించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరశురాములు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామల్ల రాజు, ఉపసర్పంచ్ పాలకుర్తి శంకరయ్య, మాజీ ఎంపీటీసీ బొడ్డు రాములు, మాజీ సర్పంచ్ పిట్టల వెంకటేష్, పొట్ల మధు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు