నార్సింగి సర్కిల్‌లో అభివృద్ధి పనులపై కమిషనర్ సమీక్ష

22-10-2026 | 09:43pm

పనులు వేగవంతంగా పూర్తి చేయాలి.. పారిశుధ్యంపై నిర్లక్ష్యం వద్దు

మణికొండ, అక్టోబర్ 22 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Cyberabad Municipal Corporation) కమిషనర్ గురువారం నార్సింగి సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జోనల్ కమిషనర్ నారాయణ, డిప్యూటీ కమిషనర్ జి. లక్ష్మారెడ్డి, ఈఈ శిరీష తదితర అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి, పలు సూచనలు చేశారు.

చిత్రపురి కాలనీలో సుమారు కిలోమీటరు మేర నిర్మిస్తున్న మోడల్ రోడ్డును పరిశీలించిన కమిషనర్, రహదారికి ఆనుకుని చేపడుతున్న ఫుట్‌పాత్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నార్సింగిలోని వరలక్ష్మి టిఫిన్స్ సమీపంలో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను పరిశీలించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు