ఆహార భద్రతకు భరోసా ఏదీ..?
- పాన్ తిని వ్యక్తికి వాంతులు..
- గడువు ముగిసిన స్వీట్ బాటిల్ కలకలం
- వ్యాపారుల నిర్లక్ష్యం.. అధికారుల మౌనం..
- ప్రమాదంలో గ్రామీణ ప్రజారోగ్యం
- హైతాబాద్లోని అన్ని దుకాణాల్లో తనిఖీలకు స్థానికుల డిమాండ్
షాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ, గడువు ముగిసిన ఆహార పదార్థాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో (Haitabad Village)వెలుగు చూసిన ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన ఆహార భద్రతపై సంబంధిత అధికా రులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
షాబాద్ మండలం హైతాబాద్లోని ఓ పాన్ షాప్లో ఉదయం స్వీ ట్ పాన్ తిన్న ఓ వ్యక్తికి తీవ్రమైన వాంతులు కావడంతో ఈ దారుణం వెలుగులోకి వ చ్చింది. బాధితుడి అనుమానంతో ఆ పాన్ షాప్లో విక్రయానికి ఉంచిన స్వీట్ బాటిల్ను పరిశీలించగా షాకింగ్ నిజం బయటపడింది. ఆ బాట్పి గడువు తేదీ సెప్టెంబర్ 2026గా ముద్రించి ఉండగా, ప్రస్తుతం అక్టోబర్ నెల కొనసాగుతుండటం గమనార్హం. గడువు ముగిసినట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ, ఆ ఉత్పత్తి విక్రయానికి ఎలా అందుబాటులోకి వచ్చిందనే దానిపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒక్క దుకాణానికే పరిమితం కాకూడదు..
ఒక దుకాణంలో గడువు ముగిసిన ఉత్ప త్తి బయటపడిన నేపథ్యంలో, హైతాబాద్ గ్రామంలోని ఇతర కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, స్వీట్ షాపులు, బేకరీలు, కూల్డ్రింక్స్ దుకాణాలు తదితర ఆహార పదార్థాలు విక్రయించే ప్రతి కేంద్రంలోనూ ము మ్మరంగా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆయా దుకాణాల్లో విక్రయి స్తున్న ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల గడువు తేదీలు, నిల్వ పరిస్థితులు, లేబులింగ్, ఆహార భద్రతా నిబంధనల అమలును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం?
గడువు ముగిసిన ఉత్పత్తులు వినియోగానికి ఏమాత్రం సురక్షితం కావు. వాటి స్వ భావం, నిల్వ ఉండే విధానాన్ని బట్టి ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్ర మాదం ఉంది. వినియోగదారులకు తెలియకుండానే ఇటువంటి ప్రమాదకర ఉత్పత్తు లు మార్కెట్లో విక్రయానికి వస్తున్నాయా? ఇప్పటివరకు ఎంతమంది వీటిని కొనుగోలు చేసి అనారోగ్యం పాలయ్యారు? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ జరపా ల ని స్థానికులు కోరుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తక్షణ స్పందనకు ఎదురుచూపు...
ఒక ఘటన వెలుగులోకి వస్తేనే స్పందిస్తా రా? ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం లో ముందస్తు తనిఖీలు ఎందుకు చేపట్టడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇ ప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు క్షేత్రస్థాయిలోకి వచ్చి, సమగ్ర తనిఖీలు చేపట్టి నిబం ధనలు ఉల్లంఘించే దుకాణాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని గ్రామస్థులు కోరుతున్నారు.