డైయిరీ యునిట్లపై దాడులు
22-09-2026 | 06:16pm
- Hayathnagar Division లోని డైయిరీ యునిట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
- లైసెన్స్ లేని యూనిట్ మూసివేత ఫుడ్ సేఫ్టీ
ఎల్బీనగర్, సెప్టెంబర్ 22 : తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీలో(Telangana Government Food Safety) భాగంగా టీజీ సేఫ్ ఏర్పాటు చేసింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం హయత్ నగర్ డివిజన్ లోని వివిధ డైయిరీ యునిట్లపై తనిఖీలు నిర్వహించి, లైసెన్స్ లేని యూనిట్ ని మూసివేశారు. తెలంగాణ ఆహార భద్రతా అధికారులు మంగళవారం ఉదయం హయత్‌నగర్‌లోని డెయిరీ యూనిట్లు, పంపిణీ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తనిఖీల్లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ నమూనాలను సేకరించింది.
తనిఖీల సందర్భంగా లైసెన్సు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు, అపరిశుభ్రమైన ప్రాంగణాన్ని నిర్వహిస్తున్నందుకు ఒక సంస్థను మూసివేశారు. డెయిరీ సంస్థలు, పంపిణీదారులలో ఆహార భద్రతా నిబంధనల పాటింపును తనిఖీ చేసేందుకు శాఖ చేపడుతున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.