ప్రైవేటు ఆసుపత్రుల ‘దోపిడీ దందా’!

12-10-2026 | 05:25am
  1. వైద్యం పేరుతో వేలకు వేలు వసూళ్లు..
  2. అప్పుల పాలవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు
  3. వైద్యారోగ్య శాఖ నిద్రమత్తు వదిలేనా?
  4. ల్యాబ్‌లు, క్లినిక్‌లపై దాడులకు డిమాండ్

శంకర్‌పల్లి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): శంకర్పల్లి ల్లో ప్రైవేటు ఆసుపత్రులు(Shankarpalli Private Hospitals), క్లినిక్లు, డియాగ్నోస్టిక్ ల్యాబ్ల దోపిడీ పరాకాష్టకు చేరింది. వైద్యం అందించడం సామాజిక బాధ్యత అన్న విషయాన్ని పక్కనబెట్టి, రోగుల భయాన్ని వ్యాపారంగా మలుచుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ జ్వరానికీ రూ. వేలల్లో బిల్లులు సాధారణ జ్వరం, దగ్గు, కడుపునొప్పి వంటి చిన్నపాటి సమస్యలకు సైతం కొండంత బిల్లులు వేస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు.

కన్సల్టేషన్ ఫీజు పేరుతో మొదలయ్యే వసూళ్ల పర్వం.. అవసరం లేకపోయినా రాసే రక్త పరీక్షలు, ఎక్స్-రేలు, విపరీతమైన స్కానింగ్లతో తడిసిమోపెడవుతోంది. రోగిని చేర్చుకునే ముందు అయ్యే ఖర్చుల వివరాలను పారదర్శకంగా వెల్లడించకపోవడం, డిశ్చార్జ్ సమయంలో భారీ బిల్లులు చేతిలో పెట్టి వేధించడం పరిపాటిగా మారింది.

ప్రాణాలు పోతే ‘లక్షల్లో’ సెటిల్మెంట్లు!

గత నెల రోజుల్లో పట్టణ కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగి మృతి చెందగా, బాధితుల ఆందోళనలతో పోలీసులు రంగప్రవేశం చేసి రూ. 9 లక్షల నష్టపరిహారం ఇప్పించి కేసును సర్దుబాటు చేశారనే ఆరోపణలున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగినా, బాధ్యులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోకుండా సెటిల్మెంట్లు చేసుకోవడంతో ప్రైవేటు యాజమాన్యాలకు భయం లేకుండా పోయిందని స్థానికులు మండిపడుతున్నారు.

అనుమతులు లేని ల్యాబ్లు.. కమీషన్ల దందా పలు డియాగ్నోస్టిక్ ల్యాబ్లు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. క్వాలిఫైడ్ టెక్నీషియన్లు లేకుండానే తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారనే విమర్శలున్నాయి. ఆసుపత్రులు-ల్యాబ్ల మధ్య అంతర్గత కమీషన్ల ఒప్పందాల కారణంగా రోగులకు అనవసరమైన పరీక్షలు రాస్తూ, వారిని ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్నారు.

నిద్రమత్తులో వైద్య ఆరోగ్య శాఖ.. టాస్క్ఫోర్స్ దాడులకు డిమాండ్ ఇక్కడ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ, ఫీజుల ప్రదర్శన వంటి అంశాలపై అధికారులు తనిఖీలు చేయడం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహించాలని, అనుమతులు లేని ల్యాబ్లను సీజ్ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేసి ఉచిత వైద్యం అందేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు