మరోసారి సర్ గడువు పెంపు లేదు
- ఫారమ్- 6 కు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే..
- ఇంటివద్దకు బీఎలోఓలు వెళ్లాలి
- సీఈవో సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మందికి నోటీసులు ఇస్తే ఇప్పటివరకు 65 లక్షల మంది ఓటర్లు నోటీసులకు సమాధానం ఇచ్చినట్లు సీఈవో సుదర్శన్ రెడ్డి(CEO Sudarshan Reddy) తెలిపారు. 54 లక్షల మందిని తుది ఓటరు జాబితాలోకి తీసుకువచ్చామన్నారు. నవం బర్ 5 వరకు ఈ ప్రక్రియ ఉంటుందని, ఆలోపు మిగతా ఓటర్లను కూడా తుది ఓటరు జాబితాలోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
సర్ ప్రక్రియ గడువు మళ్లీ పొడిగించే ఉద్దేశం లేదన్నారు. ఇప్పటికే ఓసారి గడువు పెంపు కోరామని అందువల్ల ఇది కుదరదన్నారు. ప్రస్తుతం ఉన్న గడవు ప్రకారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు గడువు అక్టోబర్ 7వరకు ఉండగా నోటీసులు జారీ లేదా అభ్యంతరాల పరిష్కారానికి నవంబర్ 5 వరకు తుది గడువు ముందుందని, తుది ఓటరు జాబితా నవంబర్ 9న ప్రచురించనున్నామని సీఈ వో సుదర్శన్‌రెడ్డి మీడియకు తెలిపారు. ఇప్పటివరకు హియరింగ్ అనే ప్రక్రియ ఉండేదని ఇకపై దాని స్థానంలో డాక్యుమెంట్ కలె క్ట్ చేసుకోవడమే ఉంటుందన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో 80వేల మందికి నోటీసులు ఇచ్చామని, అవి అందుకున్న వారిలో 40శాతం మందిని తుది ఓటరు జా బితాలోకి తీసుకొచ్చామన్నారు. నోటీసులు అందినవారి ఇళ్ల దగ్గరకే బీఎల్వోలు వెళ్లి సంబంధిత పత్రాలు తీసుకుంటారన్నారు. ఒకచోట కూర్చుని ఓటర్లను పిలిపించుకోవడం కుదరదని, ఓట్లర్ల ఇళ్లవద్దకే వెళ్లి వివ రాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు బీఎల్వోలకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని తెలిపారు. నోటీసులు అందిన కుటుం బసభ్యులందరూ ఉండాల్సిన పనిలేదని ఒక్కరే మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలు ఇస్తే సరిపోతుందన్నారు.
ఫారమ్ -6కు డిక్లరేషన్ అనేది ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారని, తెలంగాణలో ఎస్ఐఆర్ ఇంకా కొనసాగుతున్నం దున ఫారమ్ -6కు డిక్లరేషన్ తప్పనిసరి అని స్పష్టంచేశారు. నోటీసులు అందిన వారిలో ఎవరైనా వలస వెళ్లి ఉంటే అలాంటి వారిని పిలవాల్సిన అవసరం లేదని, ఈఆర్వో ఆన్లైన్ లోనే వారిని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేస్తారన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాల నేది ఈసీ ఉద్దేశం అన్నారు.