మౌనదీక్ష.. వెనుక కారణమేంటి?

01-10-2026 | 06:44pm

హైదరాబాద్: గాంధీ జయంతి(Gandhi Jayanti) రోజున తెలంగాణలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అహింస, సత్యాగ్రహానికి ప్రతీకగా భావించే అక్టోబర్ 2న ఎన్నికల సంఘం(Election Commission) విధానాలను నిరసిస్తూ టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ మౌనదీక్షకు దిగనున్నారు. ఎన్నికలు, ఓటర్ల జాబితా, ఎస్‌ఐఆర్(SIR) ప్రక్రియపై తమ అభ్యంతరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ రోజును ఎంచుకున్నట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా అక్టోబర్ 2న నిరసనలకు(Protests) పిలుపులు రావడంతో ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి.

మరిన్ని వార్తలు