సీఈసీపై సీజేపీ సమరం
- జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేసేవరకు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం
- ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
- 2025 ఓటర్ల జాబితాను ఫ్రీజ్ చేయాలి
- నెలాఖరులో జంతర్‌మంతర్ 2.0
- కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజీత్ దీప్కే
- మరోవైపు నేటి నుంచి 8 వరకు ఇండియా కూటమి సేవ్ డెమోక్రసీ మార్చ్
ముంబై, అక్టోబర్ 1: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్(Chief Election Commissioner Gyanesh Kumar) తక్షణమే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Party) సమరం చేయనుంది. సీఈసీ తన పదవి నుంచి తప్పుకునే వరకూ పోరాటం చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(CJP founder Abhijeet Dipke) డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే శుక్రవారం (గాంధీజయంతి) నుంచి ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్కు వద్ద సీజేపీ ‘జైల్ భరో ఆందోళన్’ నిర్వహించనున్నట్లు మొదట ప్రకటించారు.
అయితే, చివరకు భారీ నిర సన చేస్తామని స్పష్టం చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఆ తర్వాత ఈ నెలాఖరున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘జంతర్ మంతర్ 2.0’ పేరుతో ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఈసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, 2025 ఓటర్ల జాబితాను ఫ్రీజ్ చేయాలని, తొలగించిన ఓటర్లను పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మరోపక్క సర్‌లో అక్రమాలకు బాధ్యతగా సీఈసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి 8వ తేదీ వరకు ఇండియా కూటమి కూడా పోరుకు దిగనుంది. దేశవ్యాప్తంగా ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ మార్చ్‌ను నిర్వహించనుంది. ముంబై ప్రెస్‌క్లబ్ సమావేశం లో గురువారం సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అధిపతిగా జ్ఞానేశ్‌కుమార్ వైదొలిగే వరకు నిరసనలు కొనసా గుతాయని తేల్చిచెప్పారు.
మొదట దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు ఈ ఉద్యమా న్ని విస్తరిస్తామని, ‘గోవా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతాయని చెప్పా రు. ఒకవేళ ఆయన అప్పటికీ రాజీనామా చే యకపోతే, అక్టోబర్ చివరి నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఈసీ నియామకం పారదర్శకం గా జరగాలని, ఇందులో పౌర సమాజం (సివిల్ సొసైటీ) భాగస్వామ్యం ఉండాలని కూ డా దీప్కే డిమాండ్ చేశారు.
2025 ఓటర్ల జాబితాను యథాతథంగా ఉంచాలని (ఫ్రీజ్ చేయాలని) కోరిన ఆయన, దానిని ఇకపై మార్చకూడదని అన్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, తొలగించిన ఓటర్ల జాబితాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఈ ఓట ర్ల సవరణ ప్రక్రియలో జరిగిన నిర్ణయాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా ఒక స్వతం త్ర కమిషన్ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2023లో కేంద్ర ప్రభు త్వం తెచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని రద్దు చేయాలని పట్టుపట్టారు. స్పెష ల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో అ క్రమాలు జరిగాయని, యువ ఓటర్లను ఉద్దేశపూర్వకంగా జాబితా నుంచి తొలగిస్తున్నారని సీజేపీ ఆరోపించింది.
ఎన్నికల సంఘంలోని మరో ఇద్దరు కమిషనర్లు (సుఖ్బీర్ సిం గ్ సంధు, వివేక్ జోషి) కూడా ఈ సర్ ప్రక్రియకు సంబంధించి గత 10 నెలల్లో దాదాపు 14 సార్లు తమ లిఖితపూర్వక అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తా కథనాల నేపథ్యంలో సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష కూటమి (ఇండియా అలియన్స్) కూడా సీఈసీ తీరు ను తప్పుబడుతూ ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇదే అంశంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్), శివసేన (యూబీ టీ) ఈ నెల 4న ముంబై లో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీని నిర్వహించనున్నాయి.
నేటి నుంచి ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ మార్చ్
దేశంలో సర్(ఎస్‌ఐఆర్) వివాదంపై ఇండియా కూటమి శుక్రవారం నుంచి రంగంలోకి దిగనుంది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. మహాత్మా గాంధీజీ జయంతి సం దర్భంగా దేశవ్యాప్తంగా ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ ర్యాలీలను ప్రారంభించనుంది. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు ‘సేవ్ డెమోక్రసీ’ మార్చ్ నిర్వహిస్తామని, అలాగే 6న ప్రతిపక్ష ఎంపీలందరూ ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రధాన కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. సీఈసీ జ్ఞానేష్‌ను తక్షణమే తొల గించాలని 19 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.