జల సంరక్షణే గ్రామ భవిష్యత్తుకు పునాది!

31-10-2026 | 08:24pm

సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం(Velgatoor mandal) రాజక్కపల్లి గ్రామంలో జలసిరి కార్యక్రమం(Jalasiri program)లో భాగంగా, నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా వీబీజీ రామ్‌జీ పథకం(VBG Ramji Scheme) ద్వారా ఫామ్ పాండ్  నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్‌గా ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగస్వామినై, ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు మార్కౌట్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు.

ఈ ఫామ్ పాండ్ల ఏర్పాటు ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాలు పెంపొందించడానికి అవకాశం ఉంటుందనీ,నిల్వ చేసిన నీటిని అవసరమైన సమయంలో మొక్కలు, చెట్లు మరియు వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవచ్చని, వీభీజీ రామ్‌జీ పథకం ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనీ తెలిపారు.

మరిన్ని వార్తలు