ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం
31-10-2026 | 08:19pm
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి(Sardar vallabhbhai patel jayanti)ని పురస్కరించుకొని జిల్లా అటవీశాఖ కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డీఎఫ్ఓ బాలామణి ఆధ్వర్యంలో రేంజ్ అధికారి గోవింద్ చంద్ ఐక్యత ప్రతిజ్ఞ చేయించి అనంతరం ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్రతకు ఐక్యత ఎంతో ముఖ్యమని, భారతదేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి యోగేష్ కులకర్ణి, సెక్షన్ అధికారులు మహేందర్, సాయి చరణ్, మల్లయ్య, సతీష్, యాదవరావు, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.