జిన్నారంలోనే డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలి

26-10-2026 | 05:21pm

ఉమ్మడి జిన్నారం మండల బీజేపీ నాయకులు, కార్యకర్తల నిరసన

పటాన్ చెరు/జిన్నారం, అక్టోబర్ 26: జిన్నారం మున్సిపల్ కేంద్రం(Jinnaram Municipal Center)లోనే డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, అక్కడి నుంచే పరిపాలన కొనసాగించాలని ఉమ్మడి జిన్నారం మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం జిన్నారం కేంద్రంగా డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, కొందరు నాయకులు, అధికారులు మరో ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. జిన్నారం పేరుతో కార్యాలయాన్ని వేరే చోట నిర్మించడం కాకుండా, జిన్నారంలోనే ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా పరిపాలన సాగించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు