ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రశాంతికి జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు
26-09-2026 | 09:33am
కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా స్వీకరణ.. అంగన్వాడీ టీచర్ల అభినందనలు
నాగల్గిద్ద, (విజయక్రాంతి): పోషణ మాసం సందర్భంగా నాగల్గిద్ద మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రశాంతి జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు. మండలంలోని అంగన్వాడీ కేంద్రాలను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.ఈ సందర్భంగా ప్రశాంతికి మండలంలోని అంగన్వాడీ టీచర్లు అభినందనలు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల మెరుగైన నిర్వహణకు ఆమె అందిస్తున్న మార్గదర్శకత్వాన్ని కొనియాడారు. ఆమెకు జిల్లా స్థాయి గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.