ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్

26-09-2026 | 07:57am

‘కల్కి 2898 ఏడీ’తో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్(Prabhas Next Movie).. ఇప్పుడు దాని సీక్వెల్ ‘కల్కి 2’పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో(Kalki 2 Shooting Update) ప్రభాస్ పాల్గొననున్నట్లు సినీ వర్గాల్లో సమాచారం. మొదటి భాగం భారీ స్థాయిలో విజువల్ ట్రీట్‌గా నిలవడంతో.. రెండో భాగంపై అంచనాలు ఇప్పటికే పీక్స్‌లో ఉన్నాయి. కథ, ప్రభాస్ పాత్ర, యాక్షన్ ఎపిసోడ్స్‌పై ఆసక్తి పెరుగుతున్న వేళ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయం అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.  ప్రభాస్ సెట్స్‌లోకి అడుగుపెడితే.. ‘కల్కి 2’పై మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 2027 ఫస్ట్ హాఫ్ లో చిత్రీకరణ పూర్తి చేయాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావిస్తున్నారు. 2024లో వచ్చిన కల్కి 2898 AD(Kalki 2898 AD Sequel) హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

కల్కి 2898 ఏడీ.. పాత్రలే సినిమాకు మెయిన్ హైలైట్!

‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్ భైరవగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, దీపికా పదుకొణె సుమతి (SUM-80)గా, కమల్ హాసన్ యాస్కిన్గా కీలక పాత్రల్లో కనిపించారు. భైరవ కథకు బుజ్జి తోడవ్వగా.. సుమతి గర్భంలోని శిశువు చుట్టూ కథలో ప్రధాన సంఘర్షణ నడుస్తుంది. అశ్వత్థామ పాత్ర పురాణ నేపథ్యాన్ని భవిష్యత్ ప్రపంచంతో అనుసంధానించే కీలక లింక్‌గా నిలిచింది. ఇక సినిమాలోని ప్రత్యేక క్యామియోలూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. విజయ్ దేవరకొండ అర్జునుడిగా, దుల్కర్ సల్మాన్ కెప్టెన్‌గా కనిపించగా.. దిశా పటానీ రాక్సీ, పశుపతి వీరన్, శోభన మరియం పాత్రలు పోషించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో యాస్కిన్‌లో వచ్చిన మార్పు, అశ్వత్థామ–సుమతి–భైరవ పాత్రల చుట్టూ ఏర్పడిన పరిస్థితులు ‘కల్కి 2’పై మరింత ఆసక్తిని పెంచాయి.

మరిన్ని వార్తలు