సీఎం ఇలాఖాలోనే మహిళా సర్పంచ్‌పై వివక్ష
రేవంత్‌రెడ్డి దళిత ప్రేమ ఎక్కడ?
బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సొంత మండలంలోనే ఎస్సీ మహిళా సర్పంచ్‌పై వివక్ష కొన సాగుతోందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(BRS General Secretary RS Praveen Kumar) ఆరోపించారు. వంగూరు మండలానికి చెందిన సర్పంచ్ కాశమ్మ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
సీఎంకు ఉన్న అసలైన దళిత ప్రేమ ఎక్కడికి పోయిందని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆర్‌ఎస్పీ స్పందించారు. స్పీకర్‌పై చూపిస్తున్న ప్రేమ, ఎస్సీ మహిళా సర్పంచ్‌పై ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. గజ్వేల్లో చేయని నేరానికి మూడు కేసులు నమోదు చేశారని, ఇదే తరహాలో వంగూరులో జరుగుతున్న వివక్షపై సిట్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు.
వంగూరులో ఇసుక అక్రమ దందా జరుగుతోందని, సీఎం ఏజెంట్‌గా ఆరోపణ లు ఎదుర్కొంటున్న నరేందర్‌రెడ్డి మాఫియా విచ్చలవిడిగా వ్యవహరిస్తోందని సర్పంచ్ కాశమ్మ ఆరోపిస్తున్నారని తెలిపారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం, అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు. వేముల వీరేశం, సీతక్క, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌రెడ్డి, కాంక్షారెడ్డి వంటి ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని మం డిపడ్డారు. వంగూరులో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయనే ఆరోపణలపై ప్రభు త్వం విచారణ చేపట్టాలని, వాస్తవాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.