తెల్ల బంగారానికి నీటి దెబ్బ!

24-10-2026 | 05:10am
  1. సోయాతో కొంత ఊరట.. మక్కతో ఆశలు.. 
  2. పత్తితో రైతన్నకు కష్టాలు
  3. కంగ్టి మండలంలో 39 వేల ఎకరాల్లో మూడు ప్రధాన పంటలు..
  4. పత్తి దిగుబడిపై అన్నదాతల ఆందోళన

కంగ్టి, అక్టోబర్ 23: వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న అన్నదాతలకు ఈ ఏడాది పంటల పరిస్థితి మిశ్రమ ఫలితాలను చూపిస్తోంది. కంగ్టి మండల(Kangti Mandal) వ్యాప్తంగా పత్తి, సోయాబీన్, మొక్కజొన్న పంటలు వేలాది ఎకరాల్లో సాగవుతుండగా..ఒక పంట రైతుల్లో ఆశలు రేకెత్తిస్తే, మరో పంట ఆందోళనకు గురిచేస్తోంది. మండలంలో సుమారు 30 వేల ఎకరాల్లో పత్తి, 8 వేల ఎకరాల్లో సోయాబీన్, మరో వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతున్నట్లు అంచనా. ఈ మూడు ప్రధాన పంటలు కలిపి దాదాపు 39 వేల ఎకరాల్లో విస్తరించాయి. సోయాబీన్కు లభిస్తున్న ధర కొంత ఊరటనిస్తుండగా, మొక్కజొన్న దిగుబడిపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు తక్కువ వర్షపాతం ప్రభావంతో పత్తి దిగుబడి తగ్గే పరిస్థితి నెలకొనడం అన్నదాతలను కలవరపెడుతోంది.  

తెల్లబంగారంపై వర్షాభావం దెబ్బ..

పత్తిని తెల్లబంగారంగా భావించే రైతులకు ఈసారి వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మండలంలో సుమారు 30 వేల ఎకరాల్లో పత్తి సాగవుతున్న నేపథ్యంలో ఈ పంట దిగుబడిలో వచ్చే మార్పులు పెద్ద సంఖ్యలో రైతుల ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తక్కువ వర్షపాతం కారణంగా పంట ఆశించిన స్థాయిలో దిగుబడి ఇవ్వకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవు తోంది. పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తా యా? కూలీల ఖర్చులు, ఎరువులు, పురుగు మందుల వ్యయం పోను ఆదాయం మిగులుతుందా అనే సందేహాలు రైతులను వెంటాడుతున్నాయి. 

సోయాబీన్ ధరతో కొంత ఊరట..

మండలంలో సోయాబీన్ సాగు చేసిన రైతులకు మార్కెట్లో కింటాకు 7000 పైచిలుకు లభిస్తున్న ధర కొంత ఆశను కలిగి స్తోంది. అయితే ధర ఒక్కటే రైతుకు లాభాన్ని అందించదు. ఎకరాకు వచ్చే దిగుబడి, సాగు ఖర్చులు, మార్కెట్లో ధర ఈ మూడు అం శాలు కలిసివస్తేనే రైతుకు ఆదాయం మిగులుతుంది.పెట్టుబడులు పెరిగిన ప్రస్తుత పరి స్థితుల్లో సోయాబీన్ రైతులకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. 

రైతును ఆదుకునేదెవరు?

కంగ్టి మండలంలోని పత్తి పంటల పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వర్షాభావ ప్రభావం, దిగుబడి అంచనాలపై వాస్తవిక నివేదికలు రూపొందించాల్సిన అ వసరం ఉంది. పంటల బీమా, నష్టపరిహారం వంటి పథకాల కింద అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం ప్రయోజనాలు అందే లా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సో యాబీన్, మొక్కజొన్న, పత్తి పంటలకు గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు వ్యవస్థను పర్యవేక్షించాలి. పంట చేతికొచ్చే సమయం లో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ సదుపాయాలు, ధరలపై రైతులకు స్పష్టమైన సమా చారం అందించాలి. దిగుబడి తగ్గిన సందర్భాల్లో రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోకుండా ప్రభుత్వ సహాయక చర్యలు అందుబాటులో ఉండాలి. 

మరిన్ని వార్తలు