చోరీ కేసును ఛేదించిన పోలీసులు

31-10-2026 | 07:19pm

నిందితుడి అరెస్ట్.. రూ.9.50 లక్షల నగదు స్వాధీనం

పటాన్ చెరు: కర్ణాటక ఆర్టీసీ బస్సు(Karnataka RTC Bus)లో ప్రయాణికుడి బ్యాగులోని రూ.10 లక్షల నగదు చోరీ(Cash Theft) చేసిన కేసును రామచంద్రపురం పోలీసులు, సీసీఎస్ సిబ్బంది ఛేదించారు. ఈ కేసులో కర్ణాటకకు చెందిన ఉమేష్ చవాన్ (27)ను అరెస్ట్ చేశారు.

 అశోక్‌నగర్‌కు చెందిన వ్యాపారి వెంకట రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.9.50 లక్షల నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసును త్వరితగతిన ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

మరిన్ని వార్తలు