నల్ల దుస్తులతో ఉద్యోగుల నిరసన

31-10-2026 | 08:14pm

నిర్మల్,(విజయక్రాంతి): నేషనల్ హెల్త్ మిషన్లో(National Health Mission) పనిచేస్తున్న ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం(Nirmal RDO Office) ఎదుట చేపట్టిన దీక్షలు. శనివారం దీక్ష శిబిరంలో తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు నల్ల దుస్తులను ధరించి దీక్షా శిబిరంలో నిరసన తెలిపారు. ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని జెఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణ నారాయణ మానస తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు