మోర్గి బాలికల వసతిగృహంలో 26 మందికి వైద్య పరీక్షలు
22-09-2026 | 06:06pm
నాగల్గిద్ద, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మండలంలోని మోర్గి బాలికల వసతిగృహంలో కరస్గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre) వైద్యురాలు డాక్టర్ జువేరియా బేగం ఆధ్వర్యంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. 26 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అస్వస్థతతో ఉన్న వారికి చికిత్స అందించారు.
రక్తహీనతను గుర్తించేందుకు రక్త పరీక్షలు చేశారు. విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతిగృహంలోని సరుకుల నిల్వ గది, వంటగదిని పరిశీలించారు. వాటిని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, ల్యాబ్ టెక్నీషియన్ జీవన్, ఏఎన్ఎం శోభ తదితరులు పాల్గొన్నారు.