రూ.20 లక్షలతో శివాలయంలో రేకుల షెడ్డు నిర్మాణం

26-10-2026 | 11:05pm

ఫంక్షన్ హాల్ తరహాలో ఏర్పాటుకు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ శంకుస్థాపన

నాగల్‌గిద్ద, అక్టోబర్ 26 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండల కేంద్రంలోని శివాలయం ఆవరణలో రూ.20 లక్షల సొంత నిధులతో ఫంక్షన్ హాల్ తరహాలో రేకుల షెడ్డు ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణ పనులకు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్(MP Suresh Kumar Shetkar) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు శుభకార్యాలు, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా రేకుల షెడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నిర్మాణం పూర్తయితే గ్రామంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు వివిధ కార్యక్రమాల నిర్వహణలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ లక్ష్మణ్, ఉప సర్పంచ్ ధనరాజ్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాణిక్‌రావు పటేల్, సంజు పటేల్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు