నాగల్‌గిద్దలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
17-09-2026 | 09:50pm
అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలం(Nagalgidda Mandal)లో ప్రజాపాలన దినోత్సవాన్ని(Telangana prajapalana dinotsavam) ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సంగ్రామ్‌రెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మహేశ్వరరావు, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రామకృష్ణ, మండల వనరుల కేంద్రంలో ఎంఈఓ మన్మధ కిషోర్, మహిళా సమైక్య భవనంలో ఏపీఎం నర్సింలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా. జువేరియా, సామాజిక ఆసుపత్రిలో డా. వీర్‌శెట్టి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది, గ్రామ పంచాయతీ సర్పంచులు పాల్గొన్నారు.