నూనె గింజల ఉత్పత్తి పెరుగుదలపై అవగాహన సదస్సు
మఠంపల్లి,(విజయ క్రాంతి): మండల పరిధిలోని రఘునాథపాలెం గ్రామంలో నూనె గింజల ఉత్పత్తి(Oilseed production) పెరుగుదలపై అవగాహన సదస్సు మండల స్పెషల్ ఆఫీసర్ రవి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్(Mandal Agriculture Officer Srinivas), కేవీకే సైంటిస్ట్లు నరేష్, కిరణ్, ఆత్మ చైర్మెన్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ నీనో లో ప్రభావం వల్ల వర్ష భావ పరిస్థితుల్లో దృష్ట్యా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా అరుతడి పంటలైన కందులు,పెసలు, మినుములు, జొన్నలు వేరుశనగలు ఉద్యాన పంటలైనటువంటి కూరగాయలు పండ్లు,పూల తోటలు,మునగ తోటలు,ఆయిల్ పామ్ పంటలు వేసుకోవాలని సూచించారు.ఈ ప్రత్యామ్నాయ పంటలకు ఉద్యానవన శాఖ నుంచి అందిస్తున్నటువంటి వివిధ రకాల రాయితీ పథకాల గురించి వివరించారు.కూరగాయ పందిరిలకు,డ్రిప్పు, స్ప్లింక్లర్స్ కు కూరగాయ విత్తనాలకు నారుకు అందిస్తున్న వివిధ రకాల రాయితీలను ఉపయోగించుకొని అధిక దిగుబడులు పొందవలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏఇఓ లు,ఏటిఎం లు,బిఏస్సి విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.