బీఆర్ఎస్ నాయకుల పరామర్శ
22-10-2026 | 04:36pm
బెజ్జంకి: బెజ్జంకి మండలం(Bejjanki Mandal)లోని రాంసాగర్ గ్రామ సర్పంచ్ ఇంగాల లక్ష్మి భర్త, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్(Ex-Single Window Vice Chairman) ఇంగాల నాగమల్లేశం ఇటీవల మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, జిల్లా నాయకులు దీటి రాజు తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.