19 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు
సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేట క్రైం, నవంబర్ 2: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్(Siddipet Police Commissionerate) పరిధిలో నవంబర్ 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్(Police Commissioner Rashmi Perumal), ఐపీఎస్ తెలిపారు. ఈ కాలంలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
బంద్‌ల పేరుతో బలవంతంగా సంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని ఒత్తిడి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా భారీ శబ్దాలతో డీజేలు వినియోగించడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. మైక్సెట్ల వినియోగానికి సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బీఎన్ఎస్, సిటీ పోలీస్ యాక్ట్, పోలీస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.