సాగు భూమి సంరక్షణ ప్రతి రైతు బాధ్యత

23-10-2026 | 07:16pm

దాచారంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం

గజ్వేల్, అక్టోబర్ 23: సాగు భూమిని(Cultivable land) సంరక్షించడంతో పాటు సాగునీటి వనరులను(Irrigation water resources) పొదుపుగా వినియోగించుకోవడం ప్రతి రైతు బాధ్యత అని గజ్వేల్ ఏడిఏ  బాబు నాయక్(Gajwel ADA Babu Naik) అన్నారు. శుక్రవారం గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో వ్యవసాయ శాఖ(Department of Agriculture) ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ – సాగు భూమి సంరక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం తగ్గడంతో పాటు నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు నష్టం కలుగుతుందన్నారు.

భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులు వాడాలని, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని(Use of organic fertilizers) పెంచాలన్నారు. పురుగు మందులను సిఫార్సు చేసిన మోతాదులోనే ఉపయోగించాలని, సాగునీటిని వృథా చేయకుండా సమర్థవంతమైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెన్నారెడ్డి, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, వ్యవసాయ విస్తరణ అధికారి మీనాక్షి, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు