క్షయ నిర్మూలనకు అందరూ కృషి చేయాలి

08-10-2026 | 04:11pm

ఆసిఫాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో (Collectorate)నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ క్షయ లక్షణాలను తొలిదశలో గుర్తించి ఆరు నెలల పాటు చికిత్స, పోషకాహారం అందిస్తే వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు.

యువత, వైద్యులు, సర్పంచులు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం క్షయ రహిత గ్రామాలుగా ఎంపికైన గోవింద్‌పూర్, పోతేపల్లి, పవార్‌గూడ, సాంగ్వి, ఇటిక్యాలపహాడ్, దాబా గ్రామాల సర్పంచులు, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులను సన్మానించారు.

మరిన్ని వార్తలు