మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్
చేర్యాల, అక్టోబర్ 08 (విజయక్రాంతి): బీజేపీ ఓట్ చోరీ కి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Leader Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra), సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి ఎంపీలపై లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు చేర్యాల పట్టణ, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, మండల అధ్యక్షుడు మంజె మల్లేశం ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఓటు హక్కు పవిత్రమైనదని, ఎన్నికల్లో పారదర్శకత కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.
ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఐక్యంగా పోరాడుతామన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులు, గ్రామశాఖ అధ్యక్షులు, మహిళా, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.