విద్యుత్ సరఫరాపై రైతుల ఆందోళన

08-10-2026 | 04:22pm
  1. ఎగ్లాస్పూర్‌లో రహదారిపై బైఠాయింపు
  2. మంథని–కాటారం ప్రధాన రహదారిపై నిరసన

మంథని, అక్టోబర్ 8 (విజయ క్రాంతి) మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలోని(Eglaspur Village) బస్టాండ్ వద్ద మంథని–కాటారం ప్రధాన రహదారిపై గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఆందోళన విషయం తెలుసుకున్న మంథని ఎస్ఐ సందీప్ కుమార్ తన సిబ్బందితో కలిసి రైతులతో మాట్లాడి ఆందోళన చేస్తున్న రైతులను విరమింపజేశారు.

మరిన్ని వార్తలు