కార్మిక రత్న కృష్ణమూర్తికి ఘన సన్మానం
జగదేవపూర్,నవంబర్ 2(విజయక్రాంతి): కార్మిక రత్న నేషనల్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్(Telangana State Power Employees Union) (బీఎంఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. జిల్లా ఉత్తమ రైతు అక్కినపల్లి నరసింహారెడ్డి, డీసీసీబీ జగదేవపూర్ బ్యాంక్ మేనేజర్ కుడిక్యాల నాగభూషణం ఆధ్వర్యంలో కృష్ణమూర్తికి శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు.
కార్మిక రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి జీవితంలో పేదలకు మధ్యతరగతి కార్మికులకు అండగా ఉంటు వారి అభ్యున్నతికి కృషి చేయాలి అని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల మైపాల్ హరి, శివదాస్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.