కరీంనగర్ మారథాన్‌లో కొంపెల్లి రవీందర్
27-09-2026 | 04:34pm
బెజ్జంకి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కరీంనగర్‌లో(Karimnagar) ఆదివారం నిర్వహించిన మారథాన్‌లో సిద్దిపేట జిల్లా(Siddipet District) బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన కొంపెల్లి రవీందర్(Kompelli Ravinder) అద్భుత ప్రతిభ కనబరిచారు. 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌ను(Half Marathon) 2 గంటల 25 నిమిషాల్లో పూర్తి చేసి, 50 ఏళ్లకు పైబడిన వయసు విభాగంలో విజేతగా నిలిచారు.
ప్రస్తుతం సద్గురు జూనియర్ కళాశాలలో(Sadguru Junior College) కరస్పాండెంట్‌గా కొనసాగుతున్న కొంపెల్లి రవీందర్ క్రీడలపై ఆసక్తితో క్రమం తప్పకుండా పరుగు సాధన చేస్తూ మారథాన్‌లలో పాల్గొంటున్నారు. వయసు పెరిగినా పట్టుదలతో సాధన చేస్తూ మారథాన్‌లో విజయం సాధించడం పట్ల తోటపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనను పలువురు అభినందించారు.