కొమురవెల్లి మల్లన్న ఆలయంలో సహస్త్ర దీపోత్సవం
కొమరవెల్లి ( విజయ క్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి(Komuravelli Mallikarjuna Swamy) దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా సహస్ర దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ దీపోత్సవ కార్యక్రమానికి శ్రీశైల మల్లికార్జున స్వామి పీఠాధిపతి చెన్న సిద్ధి రామ పండితారాధ్య లు పాల్గొని దీపోత్సవాన్ని ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు మహాగణపతి పూజ నిర్వహించారు.
అనంతరం స్వామివారికి మాహా హారతి నిర్వహించారు. అనంతరం సిద్ధి రామ పండితారాధ్యులు దీప ప్రజ్వలన చేశారు. ఆ తర్వాత జ్వాలాతోరణానికి జ్వాలా ప్రజ్వలన చేశారు. అటు పిమ్మట మల్లికార్జున స్వామి, అమ్మవారి రా ఉత్సవ విగ్రహాలతో పాటు జ్వాలాతోరణం దాటిన భక్తులు గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం శివలింగఅకృతిలో దీపాలకు భక్తులు, గ్రామస్తులు దీప ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీకాంత్ రావు, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, భక్తులు పాల్గొన్నారు.