సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

24-11-2026 | 09:09pm

ఎల్బీనగర్, నవంబర్ 24 : ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్(CM Relief Fund) ఎంతో మంది పేదలకు ఆసరాగా నిలుస్తుందని  ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు.  వివిధ అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందిన ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలువురు మధుయాష్కీగౌడ్ ని కలిసి ప్రభుత్వ సహకారం కోరగా..

వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ను మంజూరు చేయించారు. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం హయత్ నగర్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు  అందజేశారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. అనారోగ్యాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సీఎం రిలీఫ్ ఫండ్ వారికి ఎంతో సహకారంగా ఉంటుందన్నారు. పేదల క్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు