దేవి రవీందర్‌పై దాడిని ఖండిస్తున్నాం

23-10-2026 | 07:01pm

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎంపిటిసిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్

గజ్వేల్, అక్టోబర్ 23: రాష్ట్ర ఎంపీటీసీల సంఘం(State MPTC Members' Association) వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్‌పై(Devi Ravinder) దసరా రోజు నర్సారెడ్డి వర్గం చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపిటిసిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్ అన్నారు. దాడి ఘటనపై(Attack incident) దేవి రవీందర్‌ను ఆయన నివాసంలో పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గజ్వేల్ డివిజన్ ఏసీపీ నర్సింలును కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. 20 ఏళ్లుగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దేవి రవీందర్ ఎదుగుదలను ఓర్వలేకనే ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రశ్నించే గొంతుకలపై దాడులు చేయించడం మానుకోవాలని హితవు పలికారు.

సామాజిక వర్గాన్ని కించపరిచిన ఘటనపై కాంగ్రెస్ జిల్లా నాయకత్వం, నర్సారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మన్నే రాజు, దాచారం అరిగే అశోక్, బండారు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు