విద్యార్థులకు ఉపాధ్యాయుడి ఆర్థిక చేయూత
02-11-2026 | 03:46pm
బెజ్జంకి,(విజయక్రాంతి): విద్యార్థుల(Students) విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ తెలంగాణ మోడల్ స్కూల్(Telangana Model School) అండ్ జూనియర్ కళాశాల హిందీ ఉపాధ్యాయుడు డా. బిగుళ్ల బాబు సేవాభావం చాటుకున్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోహిత్ వర్మ, గండ్ల కావ్య, భువనేశ్వరి ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.2,200 చొప్పున మొత్తం రూ.6,600 ఆర్థిక సాయం అందించారు. యూనిఫారాలు, పాఠ్య సామగ్రి కొనుగోలు కోసం ఈ సహాయం అందజేశారు. ప్రిన్సిపాల్ ఖలీదా షిరీన్, వైస్ ప్రిన్సిపాల్ జె. శ్రీనివాస్ చేతుల మీదుగా నగదు అందించగా, ఉపాధ్యాయుడి సేవాభావాన్ని వారు అభినందించారు.