వాహన తనిఖీల్లో 63 మంది పట్టివేత
- రూ. 5.46 లక్షల జరిమానా
- డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎనిమిది మందికి జైలు శిక్ష
సిద్దిపేట క్రైం, అక్టోబర్ 16 : సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు(Traffic police) ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు వాహనాలు నడుపుతున్న 63 మందిపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు తెలిపారు. వారిలో 47 మంది మద్యం తాగి, 16 మంది లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచామని తెలిపారు.
న్యాయమూర్తి విచారణ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన అయిదుగురికి రెండు రోజులు, ఇద్దరికి ఒక రోజు, ఒకరికి 10 రోజులు జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు. 47 మందికి కలిపి రూ.4 లక్షల 66 వేలు జరిమానా విధించారని తెలిపారు. డ్రైవింగ్ లేసెన్స్ లేని 16 మందికి రూ. 80వేలు జరిమానా న్యాయమూర్తి విధించినట్టు సీఐ ముత్యంరాజు పేర్కొన్నారు.