వివాదంలో భారత పారాస్విమ్మర్
23-10-2026 | 05:00am
హోటల్ మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన
నగోయా, అక్టోబర్ 22: భారత పారా స్విమ్మర్ మహ్మద్ షమ్స్ ఆలం షేక్(Indian Para Swimmer Mohammed Shams Aalam Sheikh) వివాదంలో చిక్కుకున్నాడు. తాను బస చేసిన హోటల్లోని మహిళతో అనుచితంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదులో లైంగిక వేధింపులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా కూడా చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.