జాతీయ మోటార్‌సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగోడి సత్తా
జనగామ,(విజయక్రాంతి): ఇటీవల చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్(Madras International Circuit)లో సెప్టెంబర్ 11,12,13 తేదీల్లో జరిగిన ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్-2026(Indian National Motorcycle Racing Championship)లో జనగామ జిల్లా సిద్దెంకి గ్రామానికి చెందిన యువ రేసర్ బీదాని రాజేందర్(Young racer Bidani Rajender) సత్తా చాటారు. TVS RR310 OMC Expert Category - Round 2, Race 1లో రాజేందర్ ప్రథమ స్థానంలో నిలిచి విజయం సాధించారు.
జాతీయ స్థాయి పోటీలో విజయం సాధించడం పట్ల సిద్దెంకి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజేందర్ సిద్దెంకి గ్రామానికి చెందిన రవీందర్ కుమారుడు. తన ఈ విజయాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన ఆత్మీయుడు, గానుపాడు గ్రామానికి చెందిన కన్నెబోయిన ప్రవీణ్ కు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విజయం నా ప్రవీణ్ అన్నకు అంకితం. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి" అంటూ రాజేందర్ భావోద్వేగానికి గురయ్యారు.