జట్టును ముక్కలు చేశాడు
- ఛాపెల్పై హర్భజన్ ఆగ్రహం
- అది ఓ చీకటి అధ్యాయం
- కుట్రతోనే ఆటగాళ్ల ఐక్యత చెడగొట్టాడన్న భజ్జీ
ముంబై, అక్టోబర్ 22: భారత క్రికెట్ జట్టు కోచ్గా గ్రెగ్ చాపెల్(Greg Chappell) హయాం ఓ చీకటి అధ్యాయంగా చెప్పొచ్చు. ఛాపెల్ కోచ్గా ఉన్నప్పుడు భారత జట్టులో చెలరేగిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అప్పటి కెప్టెన్ సౌర వ్ గంగూలీని జట్టు నుంచి తప్పించడానికి అతడే కారణం. తాజాగా ఛాపెల్ కోచ్గా ఉన్నప్పుడు జట్టులో జరిగిన పరిణామాలపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) కీలక విషయాలు వెల్లడించాడు.
ఛాపెల్ను దుర్మార్గు డిగా అభివర్ణించాడు. ఉద్దేశపూర్వంగానే టీ మిండియాను ముక్కలు చేశాడని ఆరోపించాడు. ఆస్ట్రేలియా కోసమే భారత ఆటగాళ్ల ఐక్యతను దెబ్బతీసి జట్టు వాతావరణానని నాశనం చేసాడని మండిపడ్డాడు. అతని రెండేళ్ల కోచింగ్ కాలం భారత క్రికెట్లోనే ఓ చీకటి అధ్యాయమని స్పష్టం చేశాడు. జట్టులో ఆటగాళ్ల మధ్య గొడవలు సృష్టించాడనీ, కెప్టెన్ గంగూలీతో చాలా దారుణంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చాడు.