జోరు కొనసాగిస్తారా?

24-10-2026 | 05:10am

ఫుల్ జోష్‌లో భారత్

గాయంతో ఇషాన్ ఔట్

వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్

సిరీస్ సమంపై కివీస్ కన్ను

న్యూజిలాండ్ పర్యటనను అద్భుత విజయంతో ఆరంభించిన టీమిండియా సిరీస్‌లో ఇప్పుడు ఆధిక్యం పెంచుకోవడంపై కన్నేసింది. రెండో టీ20లోకి గెలిచి సిరీస్ విజయానికి చేరువవ్వాలని ఎదురుచూస్తోంది. గాయంతో ఇషాన్ తప్పుకోవడంతో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి రాను న్నాడు. అతని ఎంట్రీతో కివీస్ బౌలర్లకు టెన్షన్ మొదలైంది.

క్రైస్ట్ చర్చ్, అక్టోబర్ 23: భారత్, న్యూజిలాండ్(India vs New Zealand) రెండో టీ20కి కౌంట్ డౌన్ మొద లైంది. శనివారం క్రైస్ట్ చర్చ్ వేదికగా ఈ రసవత్తర పోరు జరగబోతోంది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ సూపర్ ఫామ్‌లో ఉండగా, శ్రేయాస్ అయ్యర్, నమన్ ధీర్ కూడా దూకుడు కొనసాగిస్తున్నారు. అయితే రెండో టీ20కి సంబంధించి భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఇషాన్ కిషన్ గాయపడడంతో చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి రానున్నాడు. అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. దీం తో సంజూ శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. వైభవ్ రాకతో కివీస్ బౌలర్లకు టెన్షన్ మొదలైంది. ఎం దుకంటే 15 ఏళ్ల వైభవ్ ఐపీఎల్‌లో కివీస్ బౌలర్లను ఉతికారేశాడు. కానీ ఫాంలో ఉన్న సంజూ శాంస న్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాంబి నేషన్‌ను డిస్టర్బ్ చేయవద్దనుకుంటే మాత్రం వైభవ్‌కు నిరాశే మిగులు తుంది. అప్పుడు శివమ్ దూబేకు చోటు దక్కుతుంది. మిగిలిన బ్యా టింగ్ లైనప్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు.

అటు బౌలింగ్ కాంబినేషన్‌లో మా ర్పులు చేసే అవకాశముంది. తొలి టీ20లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమ ర్పించుకున్నారు. ఇప్పుడు బౌలింగ్ వైఫల్యాన్ని సరిదిద్దుకోవ డం భారత్‌కు కీలకం కానుంది. మయాంక్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను తీసుకోవచ్చు. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించాలను కుంటే మాత్రం కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడు. తొలి టీ20లో న్యూజిలాండ్ స్పిన్న ర్లు సాంట్నర్, బ్రేస్వెల్ సత్తా చాటారు. కానీ భారత్ ఏకైక స్పిన్నర్తోనే ఆడింది. ఈ క్రమం లోనే కుల్దీప్ యాదవ్‌ను ఆడిం చాలనుకుంటే నితీష్ రెడ్డి బెంచ్‌కే పరిమితమవుతాడు.

మరోవైపు భారీ స్కోరు చేసినా ఫీల్డింగ్ తప్పిదాలతో ఓడిన న్యూజి లాండ్ సిరీస్ సమం చేయా లని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్‌లో అంద రూ సమిష్టిగా రాణిం చినప్పటకీ బౌలింగ్ లో మాత్రం చేతులెత్తేశారు. దీంతో బౌలర్లు గాడిన పడితే తప్ప సిరీస్ సమం చేసే పరిస్థితి లేదని కివీస్‌కు తెలు సు. పవర్ ప్లేలో భారత ఓపెనర్లను కట్టడి చేసే వ్యూహంతో ఆ జట్టు బరిలోకి దిగుతోంది. ఇక పిచ్ విష యానికొస్తే మరోసారి పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. మం చు ప్రభావం దృష్ట్యా మరోసారి టాస్ కీలకం కాబోతోంది.

తుది జట్ల అంచనా

భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్, మయాంక్ యాదవ్/ప్రిన్స్ యాదవ్, అర్షదీప్ సింగ్

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, సిఫర్ట్, కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, బ్రేస్వెల్, శాంట్నర్(కెప్టెన్), స్మిత్, జేమీసన్, హెన్రీ, ఫెర్గ్యూసన్

మరిన్ని వార్తలు