భారత్ పతకాల జోరు

23-10-2026 | 05:10am
  1. ఒక్కరోజే 26 మెడల్స్
  2. శీతల్ దేవికి రెండు స్వర్ణాలు
  3. లాంగ్ జంప్, హైజంప్‌లో పసిడి మోత
  4. డిస్కస్ త్రోలో సువర్ణ సరికొత్త చరిత్ర

నగోయా, అక్టోబర్ 22: పారా ఆసియా క్రీడ(Para Asian Games)ల్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. అంచనాలకు మించి అద్భుత ప్రదర్శనతో పతకాల మోత మోగిస్తున్నారు. గురువారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 26 పతకాలు చేరాయి. పారా ఆర్చరీలో శీతల్ దేవి రెండు స్వర్ణాలతో అదరగొడితే, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లోనూ భారత పారాఅథ్లెట్లు చరిత్ర సృష్టించారు. హై జంప్, లాంగ్ జంప్ తో పాటు డిస్కస్ త్రోలో పసిడి పతకాలు గెలుచుకున్నారు. ఆర్చరీలో గత కొంతకాలం గా రికార్డుల బద్దలుకొడుతున్న శీతల్ దేవి గురువారం రెండు స్వర్ణాలతో సత్తా చాటింది.

మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి, వరుసగా రెం డో ఆసియా పారా గేమ్స్ల్ ఛాంపియన్‌గా నిలిచింది. శీతల్ దేవి అంతకుముందు తోమన్ కుమార్‌తో కలిసి కాంపౌండ్ మికస్డ్ టీమ్ విభాగంలోనూ పసిడి పతకం సాధించింది. ఈ ఆసియా పారా క్రీడల్లో శీతల్‌కు ఇది మూడో పతకం. ఇదిలా ఉంటే మహిళల ఎఫ్54 డిస్కస్ త్రోలో 15.66 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించింది. గ్రేటర్ నోయిడాకు చెందిన 44 ఏళ్ల సువర్ణ, ఆరు ప్రయత్నాల్లో నాలుగుసార్లు డిస్క్‌ను 15 మీటర్లకు పైగా విసిరి నిల కడను చాటుకుంది.

ఐదో ప్రయత్నంలో నమోదైన 15.66 మీటర్లే ఆమెకు పసిడిని అందించింది. మరోవైపు పారా ఆసియా క్రీడల్లో పురుషుల హైజంప్ T63 విభాగం లో భారత అథ్లెట్లు క్లీన్ స్వీప్ చేసి సరికొత్త రి కార్డు సృష్టించారు. శైలేశ్ కుమార్ స్వర్ణం, వరుణ్ భాటి రజతం, రాహుల్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు. అలాగే పురుషుల 400 మీటర్ల టీ47 విభాగంలో భారత్ డబుల్ పోడియం సాధించింది.

దిలీప్ గావిట్ స్వర్ణం సాధించగా, భవికుమార్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ లైన్ నిబంధన ఉల్లంఘించడంతో భవికుమార్‌పై అనర్హత వేటు పడింది. ఫలితంగా రజతాన్ని వెనక్కి తీసుకున్నారు. మికస్డ్ డబుల్స్ టేబు ల్ టెన్నిస్ విభాగంలో భారత జోడీ భవినా పటేల్, శుభమ్ వాధ్వా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ భారత్ 21 స్వర్ణాలతో సహా మొత్తం 88 పతకాలు సాధించింది.

మరిన్ని వార్తలు