భారత మహిళలదే తొలి వన్డే
వడోదర, అక్టోబర్ 23: జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు(India Women's cricket team) 9 వికెట్ల తేడా తో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే మహిళల జట్టు 49.5 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌట్ అయింది. జింబాబ్వే బ్యాటర్లలో బిలోవ్డ్ బిజా (62హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతో 4 వికెట్లు (4/23) పడగొట్టి కెరీర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేసింది.
ఆమెతో పాటు క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 2, షఫాలీ వర్మ 1 వికెట్ సాధించారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 27.1 ఓవ ర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 200 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన ప్రతీకా రావల్ అ ద్భుత సెంచరీతో (96 బంతుల్లో 100 పరుగులు, 15 ఫోర్లు). అజేయంగా నిలిచింది. వన్డేల్లో ఆమెకు ఇది మూడో శతకం. వైస్ కెప్టెన్ షఫాలీ వర్మ కేవలం 33 బంతుల్లోనే 64 పరుగులతో* మెరుపు ఇన్నింగ్స్ ఆడిం ది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.