ఖేలో ఇండియా గేమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

24-10-2026 | 05:00am

క్రీడామంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతోందని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Sports Minister Srihari) తెలిపారు. ఖేలో ఇండియా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, క్రీడాకారుల ఎంపిక, స్టేడియాల సిద్ధత, శిక్షణ తది తర అంశాలపై శుక్రవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారుల ను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతా ల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

27 రకాల క్రీడాంశాల్లో 1:4, 1:2, 1:1 నిష్పత్తుల ఆధారంగా క్రీడాకారులను దశలవారీగా గుర్తించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఖేలో ఇండియా పోటీలకు సిద్ధం చేయాలని సూచించారు. క్రీడాకా రుల ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతిభ ఆధారంగానే అవకాశాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశా రు. కేవలం పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా, తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్లాలని తెలిపారు.

మరిన్ని వార్తలు