5 September, 2026 | 3:59 AM

దులీప్ ట్రోఫీ ఫైనల్ బరిలో స్టార్ క్రికెటర్లు

04-09-2026 | 05:50am

కేఎల్ రాహుల్, పడిక్కల్, సిరాజ్‌కు పిలుపు

ఆదివారం చెన్నై వేదికగా ఫైనల్

ముంబై, సెప్టెంబర్ 3: ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ(Duleep Trophy) ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగబోతోంది. కే ఎల్ రా హుల్, పడిక్కల్, సిరాజ్‌లు సౌత్ జోన్ తరపున బరిలోకి దిగనున్నారు. సాయి సుదర్శ న్ గాయం కారణంగా దూరం అయ్యాడు.  పడిక్కల్ మూడో స్థానంలో వచ్చి రెండు సెంచరీలతో అలరించాడు. తదుపరి న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా టెస్టులు ఆడాల్సి ఉండగా.. పడిక్కల్ దులిప్ ట్రోఫీ ఫైనల్లోనూ సత్తా చాటి టీమిండియాలో తన స్థానం సు స్థిరం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.

సౌత్ జోన్‌లో తనయ్ త్యాగరాజన్ స్థానాన్ని సిరాజ్ భర్తీ చేస్తున్నట్లు సమాచారం. సౌత్ జోన్ జట్టుకు టీమిండియా స్టార్ తిలక్ వర్మ కెప్టెన్. మరోవైపు.. ఈస్ట్ జోన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో వైభవ్ సూర్యవంశీ తన వంతు పాత్ర పోషించాడు. ఈ జట్టుకు భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్. కాగా సెప్టెంబరు 6న మొదలయ్యే ఫైనల్లో ఈస్ట్ జోన్- సౌత్ జోన్ టైటిల్ కోసం తలపడనున్నాయి.

మరిన్ని వార్తలు