ఇది ఆరంభం మాత్రమే

19-09-2026 | 05:10am

అభిషేక్‌పై యువరాజ్ ప్రశంసలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : ఆఫ్గనిస్తాన్(Afghanistan) తో చివరి టీ ట్వంటీ(T20)లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) కేవలం 30 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. తద్వా రా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో(International T20 cricket)  అత్యంత వేగవంతమైన శతకం బాదిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపద్యంలో అభిషేక్ శర్మపై అతని మెంటార్, టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్(Former Team India legend Yuvraj Singh) ప్రశంసల వర్షం కురిపించాడు.

అభిషేక్ ప్రతిభపై తనకు ఎప్పుడూ నమ్మకం ఉందని, ఇది తాను సాధించబోయే అనేక రికార్డులకు ఆరం భం మాత్రమేనని యువీ కొనియాడాడు. జనాలు విసిరిన రాళ్లను మైలురాళ్లుగా మలుచుకుంటూ.. బ్యాట్తోనే విమర్శలకు సమాధా నం చెబుతున్నావని ప్రశంసించాడు.భవిష్యత్తులోనూ వినమ్రతను కొనసాగిస్తూ, ఫలి తం కంటే ప్రాసెస్ మీదే దృష్టి పెట్టాలని సూ చించాడు. మరోవైపు ఈ రికార్డు వెనుక యు వరాజ్ సింగ్ ఇచ్చిన సలహా కీలకమని అభిషేక్ తెలిపాడు. 

మరిన్ని వార్తలు