పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజం:సిడిపిఓ పార్వతి
మఠంపల్లి,(విజయక్రాంతి): మండలంలోని బక్కమంతుల గూడెం సెక్టార్(Bakkamanthula Gudem Sector) పరిధిలోని కాల్వపల్లి తండాలో 9వ పోషణ మాసం కార్యక్రమం(9th Poshan Maah Event) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహశీల్దార్ హిమబిందు,సీడీపీఓ పార్వతి, సర్పంచులు మాలోతు సక్రు నాయక్, బానోతు అరుణా దేశ్ పాండు, డాక్టర్ కళ్యాణి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులు,బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషకాహార లోపం వల్ల కలిగే సమస్యలను నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల(Anganwadi Centers) ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ముఖ్యంగా చిన్నారుల ఎదుగుదల, ఆరోగ్యం కోసం సమతుల ఆహారం ఎంతో అవసరమని వివరించారు.డాక్టర్ కళ్యాణి ఆరోగ్యపరమైన అంశాలను వివరిస్తూ గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు.పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన తరాన్ని తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సోమమ్మ,ఆఐ శివ,సిసి జేత్రమ్,టీచర్లు,ఉపసర్పంచ్ బాబా,వార్డు సభ్యులు రమేష్,చంటి,మనుర్యి, అంగన్వాడీ సిబ్బంది,ఆశా కార్యకర్తలు,గర్భిణులు, బాలింతలు,చిన్నారులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.