ఆయుర్వేదంతో ఆరోగ్యం

23-09-2026 | 10:02pm

మోతె,(విజయక్రాంతి): ఆయుర్వేదంతో ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుర్వేద వైద్యాధికారి టి. వాణి శివ ప్రియ(PHC Ayurveda Medical Officer T. Vani Shiva Priya) అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Center)లో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్బంగా ధన్వంతరి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రపంచ ఆయుర్వేదిక దినోత్సవాన్ని(World Ayurveda Day) పురస్కరించుకొని మూడు రోజులుగా మండలంలోని సిరికొండ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది.

మోతెలో యోగ డే(Yoga Day)పై అవగాహన కల్పించారు. ధీర్ఘ కాళిక వ్యాధులపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి ప్రకృతి మనకు ప్రసాధించిన ఔషదాలు సకల రోగాల నివారణ కు ఉపయోగపడుతాయని చెప్పారు. రోగం ఏదైన అందుబాటులో ఉన్న దావఖానకు వెళ్ళి వెంటనే వైద్యులని సంప్రదించి త్వరగా రోగ నిర్దారణ చేసుకొని చికిత్స తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాదికారి భవాని, హెల్త్ సూపర్ వైజర్ పద్మ ,జి యన్ యం సుకన్య, ల్యాబ్ టెక్నషన్ వెంకటేశ్వర్లు, జి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు