గంగ స్నానానికి తరలిన భీమన్న గజాలు, రేపు జాతర

23-11-2026 | 07:56pm

నిర్మల్ నవంబర్ 23 ( విజయక్రాంతి): సోన్ మండలం సంగంపేట్ గ్రామంలో(Sangampet village) భీమన్న దేవుని గజాల ఊరేగింపు సోమవారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. పవిత్ర గంగస్నానానికి తీసుకెళ్లే ముందు గజాలను గ్రామంలోని ప్రతి ఇంటికి భాజాబజంత్రీలు, సాంప్రదాయ నృత్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గజాలకు స్వాగతం పలికారు. మహిళలు గజాలకు పసుపు, కుంకుమలు సమర్పించి భక్తిపూర్వకంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భీమన్న జాతర మహోత్సవం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

మరిన్ని వార్తలు